చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడింది ఎవరో ఒక వీడియో ద్వారా తెలిసింది. దాడి చేసింది వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి మరియు అతని అనుచరులు.
వారు ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకుంటూ రామరాజ్య స్థాపనకు సహకరించాలని కోరారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
