టిక్‌టాక్ అమెరికాలో తిరిగి సేవలు అందించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ నిషేధాన్ని నివారించేందుకు సహాయపడతానని ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్ (TikTok) అమెరికాలో వినియోగదారులకు తిరిగి సేవలను పునరుద్ధరించే ప్రక్రియలో ఉందని తెలిపింది. అంతకుముందు, సమాఖ్య చట్టం అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు ఈ యాప్ నిలిపివేయబడింది. గత అమెరికా అధ్యక్షడు జో బైడెన్ ఈ యాప్ నిషేధ చట్టంపై సంతకం చేశారు. ఆ క్రమంలో డిజిటల్ స్టోర్లు, ఇతర సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కూడా టిక్‌టాక్ యాప్‌ను తొలగించాలన్నారు. లేదంటే ఆయా టెక్నాలజీ కంపెనీలు జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. అయితే తాజాగా నిషేధం విషయంలో సహాయం చేయడానికి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాయని టిక్‌టాక్‌ను నిర్వహిస్తున్న కంపెనీ Xలో ఒక పోస్ట్ చేసింది.
