Construction of a New Bypass Road in AP
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త బైపాస్ రోడ్‌ను నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపనుంది.
అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకుంటున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ బైపాస్ సమీపంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి పుంజుకుంటోంది.
ఇన్ని రోజులు రాజధానిపై అనిశ్చితి కారణంగా పాయకపురం, జక్కంపూడి, పాతపాడు, గుణదల వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది.
ఇప్పుడ అమరావతి నిర్మా్ణం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలు ప్రధాన పెట్టుబడి గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాంతంలో పదికి పైగా కొత్త వెంచర్లు ప్రారంభం కానున్నట్లు తెలిసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత నెలకొంది.
2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. అయితే, విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం పూర్తి కావడం, అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానుండటంతో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది.
భూముల ధరల పెరుగుదలకు కారణాలు:
- అభివృద్ధి పెరుగుదల: బైపాస్ రోడ్ నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గి, రవాణా సౌకర్యం మెరుగవుతుంది.
- పెట్టుబడిదారుల ఆసక్తి: కొత్త రోడ్డు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతాయి.
- దీర్ఘకాలిక లాభాలు: భవిష్యత్తులో మెట్రో, ఇండస్ట్రియల్ హబ్‌ల అభివృద్ధికి వీలైన అవకాశం.
ఈ ప్రాజెక్ట్ ముగిసే సరికి ఆ ప్రాంతంలోని భూముల ధరలు దూసుకుపోయే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారు ఇప్పుడే సద్వినియోగం చేసుకోవచ్చు!
Share & Comment Your Views and Experience!
