మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 (Mental Healthcare Act, 2017) భారతదేశంలో మానసిక రోగులతో సహానుభూతితో వ్యవహరించడం, వారికి తగిన వైద్య సహాయం అందించడానికి రూపొందించిన చట్టం.
కేరళలో వైవాహిక సమస్యల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ తల్లి ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తన మూడు నెలల కొడుకును హత్య చేసింది. అయితే, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని ప్రస్తావిస్తూ, ఆమె తీవ్ర మానసిక క్షోభలో ఉండటమే ఈ చర్యకు కారణమని కోర్టు గుర్తించింది. అందువల్ల, కేరళ హైకోర్టు తల్లిని నిర్దోషిగా ప్రకటించింది.
Key Points
- ఆత్మహత్యాయత్నం డీక్రిమినలైజేషన్
- Sec 115: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని శిక్షించకుండా, అతనికి మానసిక చికిత్స అందించాలని పేర్కొంటుంది.
- ఆత్మహత్యాయత్నం వ్యక్తి తీవ్ర మానసిక వేదనలో ఉన్నాడని భావించాలి.
- హక్కులు & సంరక్షణ
- ప్రతి మానసిక రోగికి గౌరవంగా వైద్యం పొందే హక్కు ఉంది.
- బలవంతపు చికిత్సలు తగ్గించాలి, పేషెంట్‌కు వైద్యానికి ముందుగా అంగీకారం తీసుకోవాలి.
- సహాయ సదుపాయాలు
- ప్రభుత్వం మానసిక ఆరోగ్య కేంద్రాలు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలి.
కోర్టు తీర్పులో దీని ప్రాముఖ్యత
- కేరళ హైకోర్టు తల్లి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని, Sec 115 ప్రకారం ఆమెకు శిక్ష విధించకూడదని తేల్చింది.
- ఆమె ఆత్మహత్యాయత్నం & పిల్లను హత్య చేయడం మానసిక వేదన ఫలితమేనని, శిక్షించడం కన్నా చికిత్స అవసరమని తీర్పునిచ్చింది.
ఈ చట్టం మానసిక ఆరోగ్యాన్ని నేరంగా కాకుండా, వైద్య పరిష్కారంగా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
Share & Comment Your Views and Experience!
