Betting apps
ఇటీవల బెట్టింగ్ యాప్స్ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యాప్స్ కొంతకాలంగా భారతదేశంలో ఆన్లైన్ ద్వారా బాగా ప్రాచుర్యం పొందాయి. పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆకర్షించే ఈ యాప్స్, చివరికి ప్రజలను మోసం చేసి వారి డబ్బును కొల్లగొడుతున్నాయి.
RTC MD సజ్జనార్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు . బెట్టింగ్ అనేది ఆర్థిక నాశనానికి మరియు కుటుంబ సమస్యలకు దారితీసే ఒక ఉచ్చు అని ఆయన హెచ్చరించారు .
సెలబ్రిటీలు మరియు యూట్యూబర్లతో సహా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయాలి .
ఎలా స్కామ్ జరుగుతుంది?
- ఆకర్షణీయమైన ప్రచారం:
- ప్రముఖ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
- ఫేక్ లాభాలు చూపించడం:
- మొదట్లో చిన్న మొత్తంలో గెలుపును చూపించి మరింత పెట్టుబడి పెట్టమని ప్రేరేపిస్తారు.
- పేమెంట్ సమస్యలు:
- భారీగా గెలిచినప్పుడు ఆ డబ్బు విత్‌డ్రా చేయకుండా యాప్ మూసివేస్తారు లేదా యూజర్ అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు.
- నేర ముఠాల ప్రమేయం:
- బహిరంగంగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన స్కామ్‌ల వెనుక నేర ముఠాలు ఉంటాయి.
సెలెబ్రిటీలు, యూట్యూబర్ల ప్రమేయం
- మోసపూరిత యాప్స్‌ను లీగల్‌గా అనిపించేందుకు క్రికెటర్లు, యాక్టర్లు, ప్రముఖ యూట్యూబర్లు వీటిని ప్రమోట్ చేస్తున్నారు.
- వీరు యాప్‌లను ప్రమోట్ చేయడంపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.
ప్రజలకు సూచనలు:
- అనధికారిక లేదా అనుమానాస్పద యాప్స్‌ను డౌన్లోడ్ చేయకండి.
- అధిక లాభాల పేరుతో మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి.
- బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారం ఎప్పటికీ షేర్ చేయకండి.
ఇలాంటి మోసాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా మీరు మీ సంపదను రక్షించుకోగలరు.
Share & Comment Your Views and Experience!
