న్యూఢిల్లీ: డేటా అవసరం లేని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు కొత్త ప్లాన్స్ ప్రకటించాయి. ఈ ప్లాన్స్‌లో వినియోగదారులకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ మొట్టికాయలతో టెల్కోలు ఈ ప్లాన్స్ తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ రూ.499, రూ.1,959 టారి్‌ఫతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇందులో రూ.499 టారిఫ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎ స్లతో లభిస్తుంది. రూ.1,959 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్‌ఎంఎ్‌సలతో లభిస్తుంది. రిలయన్స్ జియో కూడా దాదాపు ఇదే సదుపాయాలతో రూ.458, రూ.1,958 టారి్‌ఫతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇందులో రూ.458ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారలు అపరిమిత వాయిస్ కాల్స్, వెయ్యి ఎస్‌ఎంఎ్‌సలు పంపుకోవచ్చు. రూ.1,958 ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ ద్వారా చందాదారులు అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎ స్లు పంపుకోవచ్చు. డేటా అవసరం లేని ప్రీపెయిడ్ చందాదారులకు ఈ ప్లాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
