2021లో క్యాపిటల్ భవనం పై దాడి నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతాలపై నిషేధం విధించారు. ఈ చర్యలపై ట్రంప్ ఆయా సంస్థలపై దావా వేశారు. ఇప్పుడు, ఈ దావాలను సెటిల్మెంట్ చేసేందుకు టెక్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా, ఎక్స్ సంస్థ ట్రంప్‌తో $10 మిలియన్ (సుమారు రూ.86 కోట్లు)కు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
అయితే, ఈ సెటిల్మెంట్పై ఎక్స్ సంస్థ లేదా ట్రంప్ బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో, ఎలాన్ మస్క్ ట్రంప్‌కు మద్దతు తెలిపారు మరియు ఆయన ప్రచారాల్లో పాల్గొన్నారు. దీంతో, ట్రంప్ ప్రభుత్వం మస్క్‌కు పాలకవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించింది.
