మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం – యూకే పార్లమెంట్లో సత్కారం!
ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికు ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమకు చేసిన విశేష సేవలు మరియు వ్యక్తిగతంగా చేసిన దాతృత్వం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు యూకే ప్రభుత్వం గుర్తించింది.
ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ (House of Commons) లో చిరంజీవిని అధికారికంగా సత్కరించనున్నారు. ప్రజా సేవలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ నెల 19న ‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Achievement Award) చిరంజీవికి ప్రదానం చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం – జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం
ప్రజా సేవలో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Achievement Award) ఇవ్వనున్నారు.
సినిమా రంగంలో చిరంజీవి అత్యుత్తమ నటనతో కోట్లాది అభిమానులను సంపాదించడమే కాక, సామాజిక సేవలో కూడా తనదైన ముద్ర వేశారు. రక్తదాన సంస్థ (Chiranjeevi Blood Bank), ఆరోగ్య సేవలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషికి గానూ ఈ గౌరవాన్ని అందిస్తున్నారు.
మెగాస్టార్‌కు ఈ అరుదైన పురస్కారం ప్రదానం కావడం తెలుగు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం!
సినీ రంగంలోనే కాదు, సేవామూర్తిగా కూడా మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకున్నారు!
Share & Comment Your Views and Experience!
